manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 9:41 am Editor : Mana Praja Prathinidhi

లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

•కొండపాకలో శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం స్కూల్‌లో ఖాళీ
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్11
కొండపాకలోని శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో 11,12వ తరగతులకు సంస్కృతం బోధించేందుకు మహిళా లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ సునయన తెలిపారు.
ఈ పోస్టుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్ఐఓఎస్ (NIOS) విద్యా విధానంలో సంస్కృత బోధన చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అభ్యర్థులు సంస్కృత మాధ్యమంలో బిఏ, ఎంఏ, బీఈడీ విద్యార్హతలు కలిగి ఉండాలని, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
రెసిడెన్షియల్ విధానంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అర్హతలకు అనుగుణంగా వేతనం అందించడంతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తామని వెల్లడించారు.
మరిన్ని వివరాలకు 8310234621, 7702000247 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.