తల్లిదండ్రులపై దారుణ దాడి… మద్యం మత్తులో కొట్టిన కుమారుడు జైలుకు!

మనప్రజాప్రతినిధి//దౌల్తాబాద్ ఏప్రిల్ 20)సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని మచిన్‌పల్లి గ్రామానికి చెందిన పొట్టొల్ల అలియాస్ పొట్టెళ్ల స్వామి (36), రైతు, తన తల్లిదండ్రులపై దాడి చేసిన కేసులో నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న స్వామి, ఆస్తి విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి కర్రతో దాడి చేయగా, అతని తల్లి తీవ్రంగా గాయపడగా, తండ్రి కూడా గాయపడ్డారు.దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ. జి. అరుణ్ కుమార్ నిందితుడిని అదుపులోకి తీసుకుని, గజ్వేల్‌లోని గౌరవ అదనపు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల...