సిమెంట్ కట్టలు మాయం

_మట్టపల్లి ఆలయంలో లెక్క చూపని అధికారులు_ధర్మకర్తలపై అనుమానాలు..._విచారణ జరపాలంటున్న భక్తులుమనప్రజాప్రతినిధి హుజూర్ నగర్//మఠంపల్లి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం లోని మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి యోగ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సిమెంట్ కట్టల బస్తాలు మాయంపై ప్రజలలో చర్చ జరుగుతుంది. ఈ దేవాలయానికి ఓ సిమెంట్ పరిశ్రమ ఇచ్చిన 300 సిమెంట్ కట్టల బస్తాలు మాయమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఎక్కడ రికార్డులు లేకపోవడం గమనార్హం. పరిశ్రమ వారు మాత్రం తాము సిమెంట్ కట్టలు ఆలయ నిర్వాహకులకు అందించామని...