•ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్ష – అధికారుల దృష్టి అభివృద్ధి పనులపై
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్17
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొండపాక మండలంలోని రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమలు విధానం, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలకు అందాల్సిన సేవలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు.
ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా లబ్ధిదారులకు చేరేలా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో తహసిల్దార్ మల్లికార్జున్ రెడ్డి,ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీవో మల్లికార్జున్, ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.