manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 4:32 pm Editor : MANA PRAJA PRATINIDHI

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి

మనప్రప్రజాప్రతినిధి//సిద్దిపేట

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి
జిల్లా,, మం,,సిద్దిపేట రూరల్ వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం, బాబు జగ్జీవన్ రామ్ సంఘం, బిడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్ర కృష్ణ, (బి డి ఎస్ ఎఫ్) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బెట ఆనంద్ ,అంబేద్కర్ సంఘం ఫౌండర్ ఎర్ర కనకయ్య, గారు మాట్లాడుతూ  ప్రపంచ దేశాలలో అతిపెద్ద రాజ్యాంగం లిఖిత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతమైనటువంటి వ్యక్తి అదేవిధంగా మనుధర్మ శాస్త్రాన్ని కాల్చి బూడిది చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మహిళలకు ఓటు హక్కును కల్పించినటువంటి ఘనత శ్రామికుల కోసం 12 గంటలు ఉన్న పని దినాలను ఎనిమిది గంటలకు చేసినటువంటి కార్మిక నాయకులు పార్లమెంటులో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం రిజర్వేషన్లు ఉన్నతమైనటువంటి కులాల్లో పుట్టినటువంటి వారికి కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి పితామహుడు అంబేద్కర్ గారు అని కొనియాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా సమాజంలోని అసమానతల కోసం అంటరానితనంపై పోరాటం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎర్ర ఎల్లం , సర్పంచ్ అంబటి దేవదాస్, ఉప సర్పంచ్ సుమన్, వార్డు మెంబర్లు, గజ్జల మహేష్, హారిక కృష్ణ, చామంతి రాజు, నాగరాజు , ప్రభాకర్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గోపని చంద్రం, సిఐటియు జిల్లా నాయకులు కనకయ్య,వెంకటయ్య, ఎర్ర కనకయ్య, రాజు, పోచయ్య, లింగయ్య,లింగయ్య ,శ్రీనివాస్, రవీందర్ , సుధాకర్ , రాజెళ్లు సత్తయ్య ,నరేష్ ,విద్యాసాగర్ గ్రామ ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.