భార్య సర్పంచ్ అయినా… పెత్తనం భర్తదే! మంగళపర్తిలో ‘సర్పంచ్ పతి’ హవా
మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా వెల్దుర్తి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో ప్రజాపాలనపై చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. గ్రామ సర్పంచ్‌గా మహిళ ఏకగ్రీయంగా ఎన్నికై బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా, అధికారిక సమావేశాల నుంచి అభివృద్ధి పనుల పర్యవేక్షణ వరకు అన్ని వ్యవహారాల్లో ఆమె భర్తే కీలక పాత్ర పోషిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.పంచాయతీ తీర్మానాలు, చెక్ పవర్, అధికారులతో సమావేశాలు, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాల్లో భర్తే ముందుండి వ్యవహరిస్తున్నారని, ఎన్నికైన మహిళా సర్పంచ్ మాత్రం పేరుకే పరిమితమైందని స్థానికులు వాపోతున్నారు....