manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 6:56 am Posted by : Mana Praja Prathinidhi

రాఘవరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ

మానవత్వం కలిగిన వ్యక్తి కోల్పోవడం తీరని లోటు – మాలోతు కవిత

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఏప్రిల్10
దుద్దెడ గ్రామానికి చెందిన శంభు దేవాలయ ట్రస్టు డైరెక్టర్ నర్ర రాఘవరెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందడం పట్ల ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
మాజీ ఎంపీ, బిఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత రాఘవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… మానవత్వం, సేవా భావం కలిగిన వ్యక్తి రాఘవరెడ్డి గారి మరణం తీరని లోటని పేర్కొన్నారు. సమాజానికి అంకితభావంతో పనిచేసిన మంచి వ్యక్తిని కోల్పోయామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు గోనె శ్రీనివాస్, గొల్లపల్లి రమేష్ కుమార్ శర్మ, వెంకీ రెడ్డి, దుర్గాప్రసాద్, చిక్కుడు బాను, పల్లె బాబు, తలారి ఎల్లం, ప్రేమ్ చందు తదితరులు పాల్గొన్నారు.