రాఘవరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ
•మానవత్వం కలిగిన వ్యక్తి కోల్పోవడం తీరని లోటు – మాలోతు కవిత మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఏప్రిల్10దుద్దెడ గ్రామానికి చెందిన శంభు దేవాలయ ట్రస్టు డైరెక్టర్ నర్ర రాఘవరెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందడం పట్ల ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.మాజీ ఎంపీ, బిఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత రాఘవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… మానవత్వం, సేవా భావం కలిగిన వ్యక్తి రాఘవరెడ్డి గారి మరణం తీరని లోటని...