manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 8:09 am Editor : MANA PRAJA PRATINIDHI

హిందూ ధర్మ రక్షణకు నడుం బిగిద్దాం

మనప్రజాప్రతినిధి//మనకొండూరు తేదీ 19 ఏప్రిల్

ఆర్ఎస్ఎస్ కరినగర్ విభాగ్ బౌద్ధిక్ ప్రముక్ సామల కిరణ్ హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలని శ్రీశ్రీశ్రీ విష్ణుసేవా నందగిరి స్వామీజీ పిలుపునిచ్చారు. స్థానిక గాలిపెల్లి హరిహర దేవాలయంలో ఆదివారం నాడు జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. హిందుత్వము మానవాళి హితం కోరే ధర్మమని, హిందువు మతతత్వవాది కాదని ఆయన చెప్పారు. మతం వేరు, ధర్మం వేరు అని పేర్కొన్నారు. హిందువుగా హిందూ ధర్మాన్ని, సంస్కృతిని తెలుసుకుని ఆచరించాలని వివరించారు. కుటుంబం నుండి పరివర్తన కొరకు మహిళలు పాటుపడాలని కోరారు. దేవాలయాలను శక్తివంతము చేయాలని అన్నారు. హిందువులు కులాల వారీగా విభజించబడడం హేయమని, హిందువులు సమైక్యంగా కలిసి జీవించాలని అన్నారు. ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్ ఎస్ ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ సామల కిరణ్ మాట్లాడుతూ దేశంలో హిందూ సంఘటన కొరకు ఆర్ ఎస్ ఎస్. స్థాపన జరిగిందని చెప్పారు. హిందువులు స్వాభిమానం, దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. దేశభక్తి సంస్థ ఆర్.ఎస్.ఎస్. అని, దేశభక్తులను తయారుచేయటమే ఆర్.ఎస్.ఎస్. వందేళ్ళుగా చేస్తుందని వివరించారు. హిందూ చైతన్యంతో దేశంలో అన్ని రంగాలు పరిపుష్టం అయ్యాయని పేర్కొన్నారు.పంచపరివర్తనతో కుటుంబంలో మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కుటుంబ జీవన విలువలు, సామాజిక సమరసత, స్వదేశీ పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు అందరము పాటించాలని పేర్కొన్నారు .సమ్మేళనంలో విద్యార్థులచే వేయబడిన  సాంస్కృతిక నృత్యాలు అందరిని ఆకట్టుకున్నవి. సామూహిక భజనలతో సమ్మేళనం ఆద్యంతం ఆనందంగా ,కోలాహలంగా జరిగింది. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సహ శారీరక్ ప్రముక్ ఎలిగేటి వంశీ,కరీంనగర్ జిల్లా పర్యావరణ ప్రముక్ బత్తిని ఆంజనేయులు,నిర్వహణ సమితి అధ్యక్షులు మల్లు గారి దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోమటి రెడ్డి శ్రీనివాస్, కోశాధికారి అయ్యన్న గారి హరికృష్ణ రెడ్డి,గాలిపల్లి సర్పంచ్ బద్ధం శేఖర్ రెడ్డి, నర్సపేట గ్రామ సర్పంచ్ బెంద్రం శంకరమ్మ, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ సింగిరెడ్డి రచన,నిర్వహణ సమితి సభ్యులు చిలుముల బాలనాగచారి,రమణారెడ్డి ,సమితి సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.