హిందూ ధర్మ రక్షణకు నడుం బిగిద్దాం

మనప్రజాప్రతినిధి//మనకొండూరు తేదీ 19 ఏప్రిల్ ఆర్ఎస్ఎస్ కరినగర్ విభాగ్ బౌద్ధిక్ ప్రముక్ సామల కిరణ్ హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలని శ్రీశ్రీశ్రీ విష్ణుసేవా నందగిరి స్వామీజీ పిలుపునిచ్చారు. స్థానిక గాలిపెల్లి హరిహర దేవాలయంలో ఆదివారం నాడు జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. హిందుత్వము మానవాళి హితం కోరే ధర్మమని, హిందువు మతతత్వవాది కాదని ఆయన చెప్పారు. మతం వేరు, ధర్మం వేరు అని పేర్కొన్నారు. హిందువుగా హిందూ ధర్మాన్ని, సంస్కృతిని తెలుసుకుని ఆచరించాలని వివరించారు. కుటుంబం నుండి పరివర్తన...