manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 9:32 am Posted by : Mana Praja Prathinidhi

ఆయుష్ డే సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్

•కొండపాక ఆరోగ్య కేంద్రంలో యోగా,ఉచిత వైద్య సేవలు
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్11
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కొండపాక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్ డేను ఘనంగా నిర్వహించారు. ఆయుర్వేద డాక్టర్ రజిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా యోగా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (దీర్ఘకాలిక వ్యాధులు) కోసం మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
క్యాంపులో మధుమేహం, రక్తపోటు, మోకాళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలు, నరాల బలహీనత, జీర్ణాశయ సమస్యలు, చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, బాధితులకు ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు ముందస్తు జాగ్రత్తల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి రోజు యోగా చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, కాలానుగుణంగా జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్, ఆయుష్ సిబ్బంది, స్థానిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.