(మనప్రజాప్రతినిధి 23)
టీపిటిఎఫ్ (TPTF) దౌల్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల విద్యాధికారి కనకరాజ్, మండల తహసీల్దార్ చంద్రశేఖరరావు పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యా రంగ అభివృద్ధికి ఇలాంటి సదస్సులు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సదస్సులో చురుకుగా పాల్గొని విద్యా ప్రమాణాల పెంపుదలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకుడు యాదగిరి మరియు మండలంలోని పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.