manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 2:49 pm Editor : Mana Praja Prathinidhi

సిద్దిపేటలో ఘనంగా తైక్వాండో కలర్ బెల్టు ప్రమోషన్ టెస్ట్

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట

ఐఎం.ఏ హాల్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారు నిర్వహించిన తైక్వాండో కలర్ బెల్టు ప్రమోషన్ టెస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తైక్వాండో జిల్లా అధ్యక్షులు శ్రీ వేలేటి రాధాకృష్ణ శర్మ గారు మరియు ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ గారు మరియు రూరల్ సీఐ శ్రీను గారు మరియు డాక్టర్ అయోధ్య రెడ్డి గారు పాల్గొని బెల్టు ప్రమోషన్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలర్ బెల్ట్స్ మరియు మెమొంటోస్ మరియు ధృవీకరణ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా రాధాకృష్ణ శర్మ గారు మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవడం ద్వారా శారీరక దృఢత్వం మరియు మేధాశక్తి పెరుగుతుందని అలానే ఆత్మ రక్షణకు ఉపయోగపడుతుందని అన్నారు సే శ్రీను గారు మాట్లాడుతూ ఈరోజుల్లో తైక్వాండో విద్యార్థులకు ఎంతగానోఉపయోగపడుతుందని మానసికంగా ధైర్యాన్నిస్తుందని మరియు జాతీయస్థాయిలో సిద్దిపేట విద్యార్థులు పథకాలు సాధించాలని అన్నారు మరియు రామ్మోహన్ గారు మరియు అయోధ్య రెడ్డి గారు మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవడం ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ విద్య అవకాశాలు ఉంటాయని తైక్వాండతో మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు అని బెల్ట్ ఎగ్జామ్ ఆర్గనైజర్, సిద్దిపేట జిల్లా తైక్వాండో కార్యదర్శి రాసకొండ శ్రీనివాస్ తెలిపారు కార్యక్రమంలో 70 మంది విద్యార్థులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు మరియు సీనియర్ తైక్వాండో క్రీడాకారులు శివ మరియు పర్మాన్, వరుణ్ రాజ్, శ్రీ వేద, విజ్ఞ శ్రీ, సుధామ్స్, నిశాంత్ పాల్గొన్నారుఇట్లుమీ రాచకొండ శ్రీనివాస్
సిద్దిపేట జిల్లా తైక్యకొండో కార్యదర్శి