manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 12:46 pm Editor : Mana Praja Prathinidhi

ఇంధన పొదుపుకు కొత్త ప్రతిపాదన

ఏపీలో పెట్రోల్ బంకుల టైమింగ్స్ మారనున్నాయా..?

ఏపీలో పెట్రోల్ బంకుల వేళల్లో మార్పుల ప్రతిపాదన

మే16.మనప్రజాప్రతినిధి//ఆంధ్రప్రదేశ్
ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే నిర్వహణకు సూచన,: ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన ఇంధన పొదుపు చర్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ బంకుల పని వేళల్లో మార్పులు చేయాలని రాష్ట్ర పెట్రోలియం ఫెడరేషన్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖను కోరింది.
వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగ్‌ల పెరుగుదలతో రాత్రి వేళల్లో ఇంధన వినియోగం తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని పరిశీలించాలని ఫెడరేషన్ సూచించింది. దీంతో రిటైల్ అవుట్‌లెట్లలో భారీ స్థాయిలో విద్యుత్ ఆదా సాధ్యమవుతుందని పేర్కొంది.
అయితే అంబులెన్స్‌లు, పోలీస్‌, ఫైర్‌ సర్వీసులు తదితర అత్యవసర సేవల వాహనాలకు అన్ని వేళలా ఇంధన సరఫరా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.