manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 10:06 pm Posted by : Mana Praja Prathinidhi

గ్రంధాలయ చైర్మన్ చంద్రం గారికి ఘన సత్కారం

శాలివాహన ఎంప్లాయిస్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు
సిద్దిపేటనియోజకవర్గం//మనప్రజాప్రతినిధి.మే12:

సిద్దిపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ ధరిపల్లి చంద్రం గారిని శాలివాహన ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫున పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు:
జిల్లా అధ్యక్షులు శ్రీ ధరిపల్లి నగేష్, కోశాధికారి శ్రీ ధరిపల్లి దుర్గయ్య, సభ్యులు శ్రీ మూడపల్లి లక్ష్మణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
చైర్మన్ కృతజ్ఞతలు
అసోసియేషన్ సభ్యులు అందించిన అభినందనలకు గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ చంద్రం గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.