manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 9:19 am Posted by : Mana Praja Prathinidhi

కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోతుల శ్రీకాంత్ నియామకం

మనప్రజాప్రతినిధి//కామారెడ్డి

కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సూచన మేరకు కామారెడ్డి నియోజకవర్గ బలోపేతం లక్ష్యంగా శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి ఆకుల హనుమాన్లు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ తాహిర్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీ పోతుల శ్రీకాంత్‌ను నియమించారు. ఈ నియామక పత్రాన్ని పార్టీ నాయకులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పోతుల శ్రీకాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్నకు, రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా కార్యవర్గ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కామారెడ్డి జిల్లాలో క్షేత్ర స్థాయిలో మరింత కృషి చేస్తానని, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలను పార్టీతో అనుసంధానం చేస్తూ సంస్థాగతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని శ్రీకాంత్ తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.