కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోతుల శ్రీకాంత్ నియామకం
మనప్రజాప్రతినిధి//కామారెడ్డి కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సూచన మేరకు కామారెడ్డి నియోజకవర్గ బలోపేతం లక్ష్యంగా శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి ఆకుల హనుమాన్లు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ తాహిర్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీ పోతుల శ్రీకాంత్‌ను నియమించారు. ఈ నియామక పత్రాన్ని పార్టీ నాయకులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పోతుల శ్రీకాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి...