manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 9:13 am Editor : MANA PRAJA PRATINIDHI

రాయపోల్ మండలంలో నడిరోడ్డుపై పడిన చెట్లు  అధికారుల నిర్లక్ష్యంపై వాహనదారుల ఆగ్రహం

(మనప్రజాప్రతినిధి//మే 06)

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్ర పరిధిలో గజ్వేల్ నుండి తిమ్మక్‌పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదకర పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి రహదారి పక్కన ఉన్న చెట్లు వేరుతో సహా కూలి నడిరోడ్డుపై పడిపోయాయి. ఈ ఘటన ఇండియన్ బ్యాంక్ సమీపంలో సుమారు 100 మీటర్ల దూరంలో చోటుచేసుకుంది.
ఈ ఉదయం సుమారు 10 గంటల సమయానికి కూడా చెట్లు తొలగించకపోవడంతో రహదారిపై రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగించాయి. వాహనదారులు ఇబ్బందులు పడటంతో పాటు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు, వాహనదారులు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే స్పందించి రహదారిని శుభ్రం చేసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా చెట్లను తొలగించి ప్రజల భద్రతను కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.