తెలంగాణ అమరవీరుల త్యాగాలకు నాటక రూపంలో నివాళి..

•సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రెస్‌మీట్•మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జూన్16తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలంగాణ నినాదం – అమరవీరుల త్యాగాలు” నాటక ప్రదర్శన విజయవంతంగా ముగిసిందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అమరవీరుల త్యాగాలు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నేటి తరానికి చేరవేసే లక్ష్యంతో ఈ నాటకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.గ్రామీణ ప్రాంతాల యువ కళాకారులకు 30 రోజుల పాటు ప్రత్యేక...