•గాయిత్రి మెడికల్ హాల్ యజమాని ముత్యాల తిరుపతి సేవాభావం
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జూన్19
సిద్దిపేట అర్బన్ మండలంలోని ఇమాంబాద్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో గాయిత్రి మెడికల్ హాల్ యజమాని ముత్యాల తిరుపతి రూ.20 వేల విలువైన స్కూల్ బ్యాగులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సురంపెల్లి రేఖ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు అందజేయడం అభినందనీయమని అన్నారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, వారానికి మూడు గుడ్లు, రాగి జావ, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కోరారు.
అనంతరం గాయిత్రి మెడికల్ హాల్ యజమాని ముత్యాల తిరుపతిని పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.రాకేష్, రోజా,జంగిటి చందు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.