ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ
•గాయిత్రి మెడికల్ హాల్ యజమాని ముత్యాల తిరుపతి సేవాభావంమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జూన్19సిద్దిపేట అర్బన్ మండలంలోని ఇమాంబాద్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో గాయిత్రి మెడికల్ హాల్ యజమాని ముత్యాల తిరుపతి రూ.20 వేల విలువైన స్కూల్ బ్యాగులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సురంపెల్లి రేఖ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు అందజేయడం అభినందనీయమని అన్నారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, వారానికి మూడు గుడ్లు,...