manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 6:03 pm Posted by : Mana Praja Prathinidhi

అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం.

•మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు.. ఆర్థిక సాయం అందజేత
మోతే,చిట్టపూర్ గ్రామాలమిత్రుల మానవత్వం..కుటుంబానికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని భరోసా
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేటభూంపల్లి మండలం.సిద్దిపేటజిల్లా.జూన్19
అక్బర్‌పేట భూంపల్లి మండల పరిధిలోని మోతే గ్రామానికి చెందిన పంజాల స్వామి గౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మోతే, చిట్టపూర్ గ్రామాల స్నేహితులు మానవత్వాన్ని చాటుతూ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా చిట్టపూర్ గ్రామ సర్పంచ్ కరిపే దయాకర్, దావతు యాదగిరి, పప్పుల నరేష్ రెడ్డి, మడ్డి స్వామి గౌడ్, మదసు పరమేశ్వర్‌తో పాటు 2002 బ్యాచ్ విద్యార్థులు కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కష్టకాలంలో కుటుంబానికి తమ వంతు సహాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా కుటుంబ సభ్యులకు అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.