అణ్వాయుధ శక్తి పెంపు

భారత్ చైనా నిల్వలుపాక్ సామర్థ్య విస్తరణ యత్నంప్రపంచ భద్రతపై ఆందోళనన్యూఢిల్లీ, జూన్ 8 (మనప్రజాప్రతినిధి): ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధ పోటీ మరింత వేగం పుంజుకుంటున్నట్లు తాజా అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ దేశాలు కొత్త తరహా అణ్వాయుధ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. అదే సమయంలో బాలిస్టిక్ క్షిపణులకు అణు వార్‌హెడ్లను అమర్చే సామర్థ్యాన్ని కూడా ఈ రెండు దేశాలు మెరుగుపరుచుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచ భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా...