ప్రజాప్రతినిధి//కోహిర్ న్యూస్
కోహిర్ మండలంలోని పోతిరెడ్డిపల్లి – కోహిర్ ప్రధాన రహదారి అధ్వానంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో రాకపోకలు మరింత కష్టంగా మారాయి.ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే గ్రామస్థులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యను వివరించినప్పటికీ ఇప్పటివరకు రోడ్డు మరమ్మతులు చేపట్టలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి పోతిరెడ్డిపల్లి – కోహిర్ రహదారిని మరమ్మతు చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు