°చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతితల్లిదండ్రుల బాధ్యత: సర్పంచ్ ఘణపురం కృష్ణ.
°”పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది.
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జూన్28
ఇర్కోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఎన్‌ఎం సంతోష్, కార్యక్రమ సూపర్వైజర్ లక్ష్మి, ఆశా వర్కర్లు ఇందిరా, రజిత, లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఘణపురం కృష్ణ హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొప్పిడి రాజవ్వ, వార్డుసభ్యులు,గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషన్‌రావు, కారోబారి శాప ఎల్లం, ఫీల్డ్ అసిస్టెంట్ మధుసూదన్ రెడ్డి,బొప్పిడి శ్రీనివాస్ రెడ్డి గ్రామ ప్రజలు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
“ఒక చుక్క పోలియో మందు.. జీవితాంతం ఆరోగ్యానికి భరోసా”