ట్రాక్టర్‌తో చెలగాటం.. డ్రైవర్ నిర్లక్ష్యానికి వాహనదారుల ఆగ్రహం

°ఇటుక లోడ్‌తో డ్రైవింగ్ సీటుపై నిలబడి ట్రాక్టర్ నడిపిన డ్రైవర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్అక్బర్‌పేటభూంపల్లిమండల//మనప్రజాప్రతినిధి.జూన్30సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండల పరిధిలోని ప్రధాన జాతీయ రహదారిపై ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన స్థానికులను, వాహనదారులను ఆందోళనకు గురిచేసింది. ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను డ్రైవర్ డ్రైవింగ్ సీటుపై నిలబడి నడుపుతూ ప్రమాదకర విన్యాసాలు చేయడం కలకలం రేపింది.ఈ దృశ్యాలను అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు.డ్రైవర్ నిర్లక్ష్యంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారీ...