manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 11:31 am Posted by : Mana Praja Prathinidhi

సిద్దిపేట రూరల్ ఎస్ఐ జి.నవతకు ఘన సన్మానం

°మర్యాదపూర్వకంగా కలిసిన ఇర్కోడ్, తోర్నాల గ్రామాల సర్పంచులు
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట నియోజకవర్గం,జూన్28:
ఇటీవల సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై సిద్దిపేట రూరల్ మండల పోలీస్ స్టేషన్‌కు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన జి. నవతను ఆదివారం ఇర్కోడ్ గ్రామ సర్పంచ్ ఘణపురం కృష్ణ, తోర్నాల గ్రామ సర్పంచ్ అర్వపల్లి గోపినాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎస్ఐ జి. నవతకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సిద్దిపేట రూరల్ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసులు ప్రజలకు మరింత చేరువై పనిచేయాలని సూచించారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ, సామాజిక శాంతి పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కోరారు.