మాదకద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థుల అవగాహన ర్యాలీ

•డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: జిల్లా కలెక్టర్ హైమావతి•అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమంసిద్దిపేటజిల్లా,జూన్26(మనప్రజాప్రతినిధి): అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర కో-ఎడ్యుకేషన్) ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, నషా ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో గురువారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ప్రజల్లో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నుంచి...