విద్యార్థులే దేశ భవిష్యత్తు
•దుద్దెడ జడ్పీహెచ్‌ఎస్‌లో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమంమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం,జూన్23మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ దుద్దెడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్)లో విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్ రావు, ఎస్‌ఐలు మల్లేశం, మహేష్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్ రావు మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనాలని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని...