manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 1:44 pm Posted by : MANA PRAJA PRATINIDHI

బాల్యం నాటి మధురస్మృతులే వెన్నంటి ఉంటవి వీరభాస్కర్

మనప్రజాప్రతినిధి//గరిడేపల్లి

బాల్యం నాటి మధురస్మృతులు  జీవితాంతం మన అంతిమ గడియల వరకు మన వెన్నంటే ఉంటవని చినర్జీ ఆగ్రో కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డు గ్రహీత  సుందరి వీరభాస్కర్ అన్నారు.   మండలంలోని పొనుగోడు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన  1990 బ్యాచ్ వారు సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు.   ఈ సందర్భంగా   వీరభాస్కర్ మాట్లాడుతూ  జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటవని వాటిలో జీవితాంతం గుర్తిండి పోయేవి మాత్రం   చిన్ననాటి సంఘటనలేనని,  మన కలయిక జీవితాంతం కొనసాగాలన్నారు.వరంగల్ లో ఎలక్ట్రికల్   డి.ఇ గా పనిచేస్తున్న   తాటికొండ కిరణ్ కుమార్  మాట్లాడుతూ  ఒకరికొకరంగా తోడ్పాటు ఇచ్చుకుంటూ  కష్టసుఖాలను సైతం పంచుకుందామని, పాఠశాల అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి సైతం కలసికట్టుగా సహకరిద్దామన్నారు.ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు Dr. బొలిశెట్టి రమేష్,  జల్లా శ్రీనివాస్, కటారు భాగ్య రావు, మచ్చ కృష్ణ, నందిపాటి సైదులు, బాల్తు అజయ్ కుమార్,   బొలిశెట్టి నాగేంద్రబాబు,  పోకల వెంకటేశ్వర్లు,  గోపగాని శ్రీధర్, రంగా, రామ్ – లక్ష్మణ్,  నర్సి, శ్రీధర్, గోపి, శోభన్, రాము, శ్రీనివాసులు, పుష్ప, విజిత, లక్ష్మి, వీరమని, వెంకటమ్మ లు, సైదమ్మ,  మోసంబి తదితరులు పాల్గొన్నారు.*