•యోగా దినోత్సవం
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు యోగా దిక్సూచి : ప్రిన్సిపాల్ దేవయ్య
సిద్దిపేట, జూన్ 20 : సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్)లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామాలు చేశారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ దేవయ్య మాట్లాడుతూ, నేటి ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి యోగా ఉత్తమ మార్గమని అన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ కనీసం అరగంట పాటు యోగాసనాలను అభ్యసించాలని సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని తట్టుకోవడంలో, జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడంలో యోగా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దరిపల్లి నగేష్ మాట్లాడుతూ, యువతలో క్రమశిక్షణ, ఏకాగ్రత, సేవాభావం పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యోగా ద్వారా లభించే శారీరక, మానసిక శక్తి సమాజ సేవలో చురుకుగా పాల్గొనేందుకు దోహదపడుతుందని వివరించారు.
స్టూడెంట్ కౌన్సిలర్లు కనక చంద్రం, ఫాతిమా, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ అశోక్ విద్యార్థి దశ నుంచే ఆరోగ్య సూత్రాలను పాటించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అనంతరం క్రమశిక్షణ కమిటీ ఇన్‌చార్జ్ నట్ శ్రీనివాస్ రెడ్డి, రాజ్యలక్ష్మి విద్యార్థులకు యోగాసనాలను ప్రదర్శించి నేర్పించారు.
విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు క్లిష్టమైన యోగాసనాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రాణాయామం, ధ్యానం కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రఘురాజ్ దాస్, రాజశేఖర్ రెడ్డి, అఖిల్, వెంకటరమణ, నరేందర్ రెడ్డి, కొమురయ్య, శ్రీకాంత్, రవి, గంగాధర్, సత్యనారాయణ, విజయభాస్కర్, శ్రీనివాస్, కబడ్డీ రిఫరీ వెంకటేష్, నాన్-టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.