జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో దీక్ష పరివార్ విద్యార్థుల సత్తా

°బంగారు పతకంతో రాష్ట్ర స్థాయికి పి.లక్ష్మీ.మధుమతి ఎంపిక. °18మంది విద్యార్థుల పాల్గొనడం..పలు విభాగాల్లో పతకాలు.°విజేతలనుఅభినందించినప్రిన్సిపాల్,యాజమాన్యం,ఉపాధ్యాయ బృందంమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జులై8జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో దీక్ష పరివార్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాలకు కీర్తి తీసుకువచ్చారు. అండర్-14, అండర్-12, అండర్-10, అండర్-8 విభాగాల్లో మొత్తం 18 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.అండర్-14 విభాగంలోని ట్రయాథ్లాన్ పోటీల్లో పి. లక్ష్మీ మధుమతి అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధించింది.అండర్-10 విభాగంలో 60 మీటర్ల పరుగుపందెంలో...