బంగారం, వెండి ధరల్లో ఒడిదొడుకులు
అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్‌లో మార్పులుడాలర్ బలం, వడ్డీ రేట్ల అంచనాల ప్రభావంపెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచనజూలై 16 (మనప్రజాప్రతినిధి): బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఒక రోజు పెరుగుదల కనిపిస్తే మరుసటి రోజు తగ్గుదల నమోదవుతోంది. అమెరికా వడ్డీ రేట్లపై నెలకొన్న అనిశ్చితి, డాలర్ బలపడటం, పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులు వంటి అంశాలు బులియన్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, కేంద్ర బ్యాంకు తీసుకునే నిర్ణయాలపై అంచనాల...