-పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం
సిద్దిపేటనియోజకవర్గం:జూలై2//మనప్రజాప్రతినిధి.
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియామకమైన జక్కుల సిద్ధిరాములును పార్టీ నాయకులు ఘనంగా శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా కార్యదర్శిగా అవకాశం కల్పించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ పెద్దల మార్గదర్శకత్వంలో, ఏఐసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని జక్కుల సిద్ధిరాములు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ రాష్ట్ర నాయకులు దాస అంజయ్య, అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొలిమి భిక్షపతి, సీనియర్ నాయకులు మార్కా సతీష్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దాం లక్ష్మి, కాంగ్రెస్ నాయకురాలు లహరి, వెల్కటూరు సర్పంచ్ వల్లూరు నరేష్, గ్రామ వార్డు సభ్యులు రవి, నరాల బాబు, ఆత్మ కమిటీ డైరెక్టర్ జామచెట్టు నర్సింలు, సీనియర్ నాయకులు కురుమళ్ల రాజశేఖర్ రెడ్డి, నవీన్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.