జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా జక్కుల సిద్ధిరాములుకు ఘన సన్మానం.
-పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టంసిద్దిపేటనియోజకవర్గం:జూలై2//మనప్రజాప్రతినిధి. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియామకమైన జక్కుల సిద్ధిరాములును పార్టీ నాయకులు ఘనంగా శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా కార్యదర్శిగా అవకాశం కల్పించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ పెద్దల మార్గదర్శకత్వంలో, ఏఐసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేసేందుకు...