పెంచికల్ దిన్నలో పంచాయతీ కార్యదర్శికి ఘన సన్మానం
మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, జూలై 1:పెంచికల్ దిన్న గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శి ఇంజమూరి సైదులును ఎంఆర్పీఎస్ నాయకులు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు యడవల్లి అరుణ్ మాదిగ, గౌరవ అధ్యక్షుడు సిద్ధ పంగు సైదులు మాదిగ, కందుల ప్రవీణ్ మాదిగ, యడవల్లి నాగరాజు మాదిగ, చిలక వెంకటేశ్వర్లు మాదిగ తదితరులు పాల్గొన్నారు.