manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 2:49 pm Posted by : Mana Praja Prathinidhi

పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు

°జక్కాపూర్ బాధిత కుటుంబానికి చెక్కు అందజేసిన బ్యాంకు మేనేజర్ రాజేష్
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.నారాయణరావుపేటమండలం.జులై16
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జక్కాపూర్ గ్రామానికి చెందిన మేర రాజు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబివై) పథకం కింద మంజూరైన రూ.2 లక్షల బీమా పరిహార చెక్కును సంబంధిత బ్యాంకు మేనేజర్ రాజేష్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి సామాజిక భద్రతా పథకాలు కుటుంబాలకు ఆపద సమయంలో ఆర్థిక భరోసాను కల్పిస్తాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరి ప్రభుత్వం అందిస్తున్న బీమా సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
బీమా పరిహారం అందుకున్న మేర రాజు కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకు అధికారులు, అలాగే తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బీమా చెక్కు కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.