3తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు

-పండ్లు కొనుగోలు చేస్తున్నట్లు నటించి దోపిడీకి పాల్పడిన కేటుగాళ్లు-టోల్‌గేట్ వద్ద మహిళపై దాడి.. క్షణాల్లో చైన్‌తో పరార్కొండపాకమండలం,జులై1(మనప్రజాప్రతినిధి): సిద్దిపేటజిల్లా. కొండపాక మండలం దుద్దెడ టోల్‌గేట్ వద్ద పట్టపగలు దోపిడీ కలకలం రేపింది. గ్రామంలో రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఎరుకల కనకవ్వ (50) అనే మహిళను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దుండగులు అత్యంత చాకచక్యంగా ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యారు.పండ్లు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ మహిళకు దగ్గరైన దుండగులు, ఆమె అప్రమత్తంగా లేని...