manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 9:04 pm Posted by : Mana Praja Prathinidhi

హరీష్ రావు చొరవ ఫలితం… వెలుగుల హారంగా మారిన జాతీయ రహదారి.

°మాజీ సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి చేతుల మీదుగా బటర్‌ఫ్లై లైట్ల ప్రారంభం.

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జూలై4
సిద్దిపేట పట్టణం నుంచి బూరుగుపల్లి మీదుగా ఇర్కోడ్ వరకు జాతీయరహదారి 765 విద్యుత్ వెలుగులతో కళకళలాడుతోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీష్ రావు చొరవతో ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై అలంకరణ విద్యుత్ దీపాలను శనివారం బూరుగుపల్లి నుంచి ఇర్కోడ్ వరకు మాజీ సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇర్కోడ్ సర్పంచ్ గణపురం కృష్ణ,వార్డ్ సభ్యులు.ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, రాత్రి వేళల్లో ప్రయాణికులకు సౌకర్యంతో పాటు రహదారికి కొత్త అందాన్ని తీసుకొచ్చేలా విద్యుత్ దీపాల ఏర్పాటు చేయించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఇర్కోడ్ ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ, మాజీ ఎంపీటీసీలు రాజబాబు, చిట్యాల సత్యనారాయణ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ వాసురి స్వామి, అర్బన్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పూల బాలకృష్ణ రెడ్డి, కిష్టసాగరం సర్పంచ్ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు పాశం రాజిరెడ్డి, ఎన్‌సాన్‌పల్లి మాజీ సర్పంచ్ బోల్గం రవీందర్ గౌడ్, మాచాపూర్ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు మారెడ్డి లింగారెడ్డి, సీనియర్ నాయకులు మారెడ్డి మధుసూదన్ రెడ్డి, బొప్పిడి శ్రీనివాస్ రెడ్డి, కుంభం సురేష్ రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మారెడ్డి నరేందర్ రెడ్డి, మారెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.