manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 7:49 am Posted by : Mana Praja Prathinidhi

దుద్దెడలో వైన్ షాప్‌లో చోరీ.. రూ.25 వేల నగదు, మద్యం బాటిళ్లు అపహరణ

°కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీం ఆధారాల సేకరణ.. నిందితుడి కోసం గాలింపు.
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జూలై4
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో ఉన్న వైన్ షాప్‌లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.25 వేల నగదుతో పాటు విలువైన మద్యం బాటిళ్లను గుర్తుతెలియని దుండగుడు అపహరించినట్లు సమాచారం.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై తిరుమల వైన్స్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరించింది.
దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి త్వరలోనే పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు క్లూస్ టీం ఎస్సై శరత్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.