ఆగస్టు 25న ఉద్యోగ మేళా

మెడ్ ప్లస్‌లో 100 పోస్టుల భర్తీఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌ పోస్టులకు అవకాశంఉస్మానియా యూనివర్సిటీలో ఇంటర్వ్యూలుహైదరాబాద్,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి):నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ప్రకటించింది. మెడ్ ప్లస్ గ్రూప్ సహకారంతో నిర్వహించే ఈ ఉద్యోగ మేళాలో ఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఆగస్టు 25న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు....