మెడిపల్లిలో కల్తీ మసాలాల గుట్టురట్టు
ప్రజారోగ్యంతో చెలగాటమాడిన అక్రమ వ్యాపారంపోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో దాడులురూ.25 లక్షల విలువైన సరుకు స్వాధీనంకల్తీ వ్యాపారులపై కఠిన చర్యల హెచ్చరికమల్కాజిగిరి,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై మల్కాజిగిరి పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి భారీ స్థాయిలో మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌లో అపరిశుభ్ర పరిస్థితుల్లో కల్తీ మసాలా పొడులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో సుమారు రూ.25 లక్షల విలువైన...