manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 1:38 pm Posted by : MANA PRAJA PRATINIDHI

మేళ్లచెరువులో దారుణం గొడ్డళ్లతో పరస్పర దాడులు

మనప్రజాప్రతినిధి//మేళ్లచెరువు:

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటిపక్కనున్న వేపచెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం గొడ్డళ్లతో దాడులకు దిగాయి.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇరువర్గాలను అడ్డుకునే క్రమంలో మేళ్లచెరువు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌కు కూడా గాయాలయ్యాయి.ఘటనతో ఎర్రగడ్డతండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టారు.