నీట్ ఆందోళనలపై కమిటీ

పోలీసుల బలప్రయోగ ఆరోపణలపై విచారణఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి బృందంమధ్యంతర నివేదికలు ఇవ్వాలని సుప్రీం ఆదేశంన్యూఢిల్లీ,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా నిర్వహించిన చలో పార్లమెంట్ ఆందోళనల సందర్భంగా పోలీసుల బలప్రయోగంపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు...