manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 4:34 pm Posted by : MANA PRAJA PRATINIDHI

కడప నుండి ఢిల్లీకి బయలుదేరిన సిపిఐ శ్రేణులుగాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి

మనప్రజాప్రతినిధి//కడప

సమగ్రాభివృద్ధి సామాజిక న్యాయం, విభజన హామీల అమలు, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం, మార్పే లక్ష్యంగా సెప్టెంబర్ 1 న చలో ఢిల్లీ
కడప నుండి ఢిల్లీకి బయలుదేరిన సిపిఐ శ్రేణులు
గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శిఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి ప్రజలు, ప్రజా సమస్యలు పూర్తిగా పక్కకు నెట్టి కుల మతాల మధ్య వైశ్యమ్య రాజకీయాలు చేస్తూ స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థలను శాసిస్తూ, ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా నిరంకుశ పాలన సాగిస్తున్న బిజెపి విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరుగు భారీ బహిరంగ సభ కు శుక్రవారం కడప నుండి సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ లో సిపిఐ శ్రేణులు బయలుదేరారు. ఈ సందర్భంగా
సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లదానం వెలికితీత, దేశీయత, మేక్ ఇండియా, జన్ధన్ యోజన, ధరల స్థిరీకరణ నిధి , సమగ్రాభివృద్ధి వంటి ఎన్నికల వాగ్దానాలు అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయినా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన బిజెపి సర్కార్ ప్రజలో ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టి కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో వైశ్యమ్మ రాజకీయాలకు పాల్పడుతూ దేవుడి పేరుతో దేశభక్తి పేరుతో రాజకీయ లబ్ధికి వాడుకుంటూ సిబిఐ ఈడి లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ ఇటు ఎన్నికల కమిషన్ ను, ఆటో న్యాయస్థానాలను కూడా ప్రభావితం చేస్తూ బిజెపి ఇతర రాష్ట్రాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ భారత రాజ్యాంగానికి తూర్పు పొడుస్తూ, ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ, నిరంకుశ పాలనకు నిస్సిగ్గుగా ప్రకటిస్తోందని వారు విమర్శించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నమ్మబలికిన నరేంద్ర మోడీ ప్రతి ఏటా విత్తనాలు ఎరువులు పురుగుమందులు పెట్టుబడుల భారాన్ని పెంచుతూ రాయితీలను కుదిస్తూ కనీస మద్దతు ధరపై కనికరం చూపకుండా, గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించకుండా, అతివృష్టి అనావృష్టితో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు రుణ విముక్తుల్ని చేయడానికి ససేమిరా అంటూ సాగు చట్టాల పేరుతో వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను కట్టు బానిసలుగా మార్చాలని చూస్తున్నారన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుండి శ్రమజీవుల రక్త మాంసాలతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా తెగ నమ్ముతూ కార్మిక చట్టాలను సమూలంగా మార్పులు చేసి శ్రమదోపిడీకి ద్వారాలు తెరిచారన్నారు.
విద్యారంగానికి తగినన్ని నిధులు కేటాయించకుండా ఒక పక్కా ప్రణాళికతో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి, కార్పొరేటు సంస్థలపై ఆధారపడే స్థితికి నెట్టారన్నారు. యూనివర్సిటీలకు నిధులు నియామకాలు చేపట్టకుండా రాష్ట్రాలకు ఉన్న హక్కులు అవకాశాలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఎక్కించాలన్న చూస్తున్నారన్నారు. వరుస పేపర్ లీకేజీలతో ప్రభుత్వ మీద నమ్మకం కోల్పోయే విధంగా వ్యవహరిస్తున్నారని, లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని అరికట్టడంలో విఫలమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్న ప్రజల డిమాండ్ ను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలకు సమాధి కడుతుందన్నారు.
మహిళలను గౌరవిస్తాం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన నేతలు డీ లిమిటేషన్ , మహిళా బిల్లుకు ముడిపెట్టి చట్టసభల్లో 33 .3శాతం రిజర్వేషన్ బిల్లు వీగిపోయేటట్లు చేసిందన్నారు. వీరు ఏలుబడిలో మైనర్ బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, బాబాల పేరుతో, మంత్రాల పేరుతో మూడవిశ్వాసాలను పెంచి పోషిస్తున్నది అన్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కులు అడుగడుగునా కాలరాస్తూ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలవారీగా జనగణనలో కుల గణన నిర్వహించాలని ఒకవైపు ఉద్యమం సాగుతుంటే అందుకు భిన్నంగా ఎస్ ఐ ఆర్ పేరుతో ఆయా వర్గాలను అణచివేయాలని చూస్తోందన్నారు.
ఒకే నోటు, ఒకే పన్ను ద్వారా దేశ అభివృద్ధి జరుగుతుందని అందుకోసం డిమానిటైజేషన్, జిఎస్టి తెచ్చిందని ఈ రెండింటి వల్ల ప్రజలకు అదనంగా ఒరిగిందేమీ లేదని దేశంలో కావలసినన్ని సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ వాటిని మానవ వనరులకు అనుసంధానించి ఉత్పాదక రంగంలో యువత ను భాగస్వామ్యం చేసి తలసరి ఆదాయాన్ని పెంచి ప్రపంచ దేశాలతో విద్యా వైద్యం ఉద్యోగ ఉపాధి పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం పర్యాటక రంగం పోటీపడే విధంగా పరిశోధనలు అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తూ సంపదనంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించి వారి ఆదాయాన్ని జాతీయ ఆదాయంగా చూపిస్తూ ప్రపంచ దేశాలలో వారిని అపర కుబేరులతో పోటీ పడేందుకు ప్రభుత్వమే వారికి ఎర్ర తివాచీ పరిచి మద్దతు పలుకుతుందన్నారు. సంపద సృష్టిలో భాగస్వామ్యమైన శ్రమజీవులకు సంపద పంపిణీ చేయకుండా ఉన్నవాడికి లేనివాడికి అంతరాన్ని పెంచు ఆకలి పేదరికం దారిద్రం నిరుద్యోగం నిరక్షరాస్యతను యధావిధిగా కొనసాగిస్తుందన్నారు. కోతలో వాతలు ప్రజల పైన, ఆదాయం అంబానీ ఆదానీలకు దోచిపెట్టడం వరకే పరిమితం కాకుండా దేశంలో సకల సమస్యల పరిష్కారానికి అయోధ్యలో రామ మందిరం నిర్మాణమే ఏకైక శరణ్యమని మాట్లాడిన మనువాదులు అయోధ్యలో వసువులైన డబ్బులు, వెండి, బంగారం అపహరించిన ఇంటి దొంగలను ఎందుకు పట్టుకోరని వారు నిలదీశారు.
రాష్ట్రానికి రావలసిన హక్కులు అవకాశాలు విభజన హామీలు అమలు వంటి విషయాలపై నిలదీయలేని డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తి, రాష్ట్ర రాజధాని నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వంటి వాటిపై డబల్ ఇంజన్ సర్కార్  కూడా సాధించుకోకపోతే ఇంకెప్పుడు సాధిస్తారని వారు సూటిగా ప్రశ్నించారు.
ప్రశ్నించడం కోసమే పుట్టిన జనసేన అధికారాన్ని పంచుకున్న తర్వాత ప్రశ్నించిన రావణ్ పై ఎందుకు కక్షగట్టి పోలీస్ కేసులు పెట్టి హింసకు పాల్పడుతోందని వారన్నారు.
సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా నిరంకుశ ప్రభుత్వ మెడలు వంచి దేశం కోసం జాతి ఏకం కావాలని అందుకోసం కడప జిల్లా నుండి సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకానున్నట్లు వారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎన్ వెంకట శివ, పి సుబ్బరాయుడు, ఎన్ విజయలక్ష్మి, కేసీ బాదుల్లా, ఎం వి సుబ్బారెడ్డి, పి చంద్రశేఖర్, శ్రీరాములు, బాలు, మస్తాన్, రవికుమార్, భాగ్యలక్ష్మి, మల్లికార్జున, నాగేశ్వరరావు, బుర్రి ఈశ్వరయ్య, లింగన్న, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అభివందనములతో.,
గాలి చంద్ర
సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.