జీవో 97పై ఈటల రాజేందర్ విమర్శలు

- పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన- 22ఏ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ- ప్రజావ్యతిరేక నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్- హౌస్ అరెస్ట్ ఘటనను ఖండించిన బీజేపీహైదరాబాద్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని తార్నాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించి పాలకులు...