రాఘవేంద్రరావు వల్లే స్టార్‌ అయ్యా: రమ్యకృష్ణ

హైదరాబాద్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): సుదీర్ఘ సినీ ప్రస్థానం కలిగిన ప్రముఖ నటి రమ్యకృష్ణ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తనకు చిత్ర పరిశ్రమలో ‘ఐరన్‌ లెగ్‌’ అనే ముద్ర కూడా పడిందని తెలిపారు. సినిమా వద్దనుకుని వెళ్లిపోయేంతటి పరిస్థితులు కూడా ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు.తన కెరీర్‌లో ఎదురైన కష్టాలను అధిగమించి స్టార్‌డమ్‌ సాధించడానికి దర్శకుడు కే. రాఘవేంద్రరావు కారణమని రమ్యకృష్ణ వెల్లడించారు. ఆయన తనకు దైవసమానమైన ఆశీర్వాదమని అన్నారు. ఆయన లేకపోతే తాను ఆ కష్టాలను దాటలేకపోయేదాన్నని, తాను స్టార్‌గా ఎదగడానికి రాఘవేంద్రరావే...