భారత్ నా రెండో ఇల్లు.. వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సిడ్నీ,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి):: ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ భారత్‌ను తన రెండో ఇల్లుగా అభివర్ణించాడు. సొంత దేశం ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత్‌లోనే తనకు ఎక్కువ ప్రేమాభిమానాలు, మద్దతు లభించాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీలోని భారత కాన్సులేట్ నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వాట్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.భారత్‌లో క్రికెట్‌ను ఆరాధించే వారి సంఖ్య ఆస్ట్రేలియాతో పోలిస్తే ఎంతో ఎక్కువని వాట్సన్ పేర్కొన్నాడు. భారత్‌లో తనను ఎవరూ పెద్దగా విమర్శించలేదని, అక్కడ ఎప్పుడూ లభించిన మద్దతును తాను మరువలేనని...