గ్రూప్-1 వివాదంపై జగన్ సవాల్
సీబీఐ విచారణకు సిద్ధమన్న వైసీపీ అధినేతడీఎస్సీ అంశంపై చంద్రబాబును ప్రశ్నించిన జగన్ఉద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని వ్యాఖ్యతాడేపల్లి,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల వ్యవహారంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాల అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. గ్రూప్-1 నియామకాలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, అదే విధంగా డీఎస్సీ...