బీఆర్ఎస్‌పై కవిత సంచలన ఆరోపణలు
- పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందని వ్యాఖ్యలు- హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు- తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారంటూ ఆరోపణలు- ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా టీఆర్ఎస్‌ను బలోపేతం చేస్తామని స్పష్టంహైదరాబాద్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం, కొందరు ప్రముఖ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీని కొందరు నేతలు హస్తగతం చేసుకునేందుకు...